కాస్టింగ్ కౌచ్ ఈ పదం సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన సంగతి అందరికి తెలిసిందే.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇండస్ట్రీ జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి కొందరు మహిళలు బహిరంగంగానే వెల్లడించారు.అయితే ఈ కాస్టింగ్ కౌచ్‌ను అడ్డం పెట్టుకుని వారి స్వార్ధం కోసం కూడా దీనిని వాడుకున్నారనే విమర్శలు వచ్చాయి.తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ లీడర్ ,నటి ఖుష్బూ హాట్ కామెంట్స్ చేశారు. ”నాకు ఎనిమిదేళ్ల వయసులో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు నా వయసు 48. ఇన్ని సంవత్సరాల్లో నేను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించాను.
నేను ఇంత వరకు కాస్టింగ్ కౌచ్,మీటూ వంటి వాటిని ఎదుర్కొలేదు.మన ప్రవర్తనబట్టే ఎదుటి వారి ప్రవర్తన ఉంటుందని చెప్పుకొచ్చారు ఖుష్బూ. ఇండస్ట్రీ ఎవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు షూటింగ్ సమయంలో ఒకవ్యక్తి నన్ను తప్పుగా తాకాడు.ఆ సమయంలో నాకు అండగా వెంకటేశ్ నిలబడ్డారు.మీడియాలో వస్తున్నట్లు ఒక్క రాత్రి పడుకుంటే కోట్లుకి కోట్లు ఎవరు ఇవ్వరు.అసలు ఇండస్ట్రీలో ఇలా కోట్లు ఖర్చుపెట్టి పడక సుఖం పొందేవారు లేరని చెప్పుకొచ్చారు ఖుష్భు.
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- శ్రీవిష్ణు..వివాదానికి ఎండ్ కార్డు పడేనా?
- నగదు విత్ డ్రా చేస్తున్నారా…అయితే?