Thursday, May 16, 2024
- Advertisement -

పంటపండింది: లారెన్స్ ‘గంగ’ వసూళ్ల వివరాలు ఇవీ

- Advertisement -

ముని సినిమాకు పార్ట్ త్రీగా తెలుగులో ‘గంగ’ పేరుతో విడుదల అయిన డబ్బింగ్ బొమ్మ సంచలన విజయాన్నే సాధించింది. భారీ స్థాయిలో ఉన్న ఆ సినిమా వసూళ్లే ఈ విజయానికి సాక్ష్యం. డబ్బింగ్ సినిమాల స్థాయిని బట్టి చూసుకొంటే ‘గంగ’ బీభత్సమైన హిట్టే. బెల్లకొండ సురేష్ విడుదల చేసిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తంగా 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది ‘గంగ’ ప్రాంతాల వారీగా చూసుకొంటే…నైజాంలో దాదాపు ఆరు కోట్ల రూపాయలు, సీడెడ్ లో మూడున్నర కోట్ల రూపాయలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో రెండున్నర కోట్లరూపాయలు, ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు, వైజాగ్ ఏరియాలో దాదాపు రెండు కోట్ల రూపాయలు, నెల్లూరు లో 75 లక్షల రూపాయలను వసూలు చేసింది ఈ డబ్బింగ్ సినిమా.

మిగతా ఏరియాల్లో కూడా వసూలు చేసిన మొత్తాన్ని కలిపితే.. గంగ 20 కోట్ల రూపాయలను రీచ్ అవుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి ఈ సినిమా తమిళంలో కూడా మంచి విజయాన్ని సాధించింది. డబ్బింగ్ సినిమా కాబట్టి తెలుగు నిర్మాతకు హక్కులు కొనడం మాత్రమే ఖర్చు. ఇక ఎలాగూ శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో గంగ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టినట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -