అక్కినేని నాగచైతన్య తాజాగా హీరోగా నటించిన చిత్రం మజిలీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా చైతన్య భార్య సమంత నటిస్తోంది. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న సినిమా కావడం, పైగా ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదల చేసిన సినిమా టీజర్‌కు సూపర్ రెస్పన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
“వన్ బాయ్ .. వన్ గర్ల్ లుకింగు .. హైటు .. వెయిటు చెకింగు .. పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగు .. డౌరీ గివింగ్ .. మ్యారేజ్ బెల్సు రింగింగు .. సింగులు బెడ్డూ షేరింగు .. ఇన్ సైడ్ ఫస్టు లవ్ కిల్లింగు .. యూఆర్ డైయింగు .. ” అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ హీరో ఇంటర్‌డెక్షన్ ఇచ్చినప్పుడు వచ్చేలా ఉందని భావిస్తున్నారు. చైతన్య లవర్ బాయ్‌గా నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు నాగచైతన్య. క్రికెటర్‌గా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న భర్తగాను కనిపించనున్నాడు చైతన్య. ఈ సినిమాలో నాగచైతన్యకు భర్తగా సమంత నటిస్తోంది.
- Advertisement -
‘మజిలీ’ సాంగ్ అదిరింది…!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -