Sunday, April 28, 2024
- Advertisement -

భారతీయుడు 2 కి లైన్ క్లియర్

- Advertisement -

కమల్ హాసన్ అత్యంత ప ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ప్రాజెక్ట్ ఇండియన్ 2. భారతీయుడు 2 గా ఈ సినిమా తెలుగు లోకి రానున్నది. అప్పుడెప్పుడో 1999 లో వచ్చిన ఇండియన్ అనే సినిమా కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం మొదలు అయ్యి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.

బడ్జెట్ విషయం లో విభేదాలు రావడం తో నిర్మాణ సంస్థ దర్శకుడు కొన్ని రోజులు కోల్డ్ వార్ ప్రకటించుకున్నారు. అయితే ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ మీడియా లో చాలా రూమర్స్ వచ్చాయి. సినిమా ఆగిపోయింది అని కొందరు, సినిమా అవ్వట్లేదు అని ఇంకొందరు, కమల్ హాసన్ సినిమా పై ఆశలు వదిలేస్కున్నాడు అని ఇంకొందరు రూమర్స్ పుట్టించగా ఎట్టకేలకు దీని పై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.

కోలీవుడ్ వర్గాల సమాచరం ప్రకారం దర్శకుడికి నిర్మాతలకి మధ్య ఉన్న విభేదాలు అన్ని తొలగిపోయి ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలు కానున్నది అట. అనుకున్న సమయానికే షూటింగ్ ముగించి 2021 లో ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీస్కురావాలని అనుకున్నారు దర్శక నిర్మతలు. ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -