Thursday, April 18, 2024
- Advertisement -

రీపోలింగ్ జగన్ కుట్రకాదు…….. పోలింగ్ నాడు బాబు చేసిన కుట్ర

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్ విషయమై చంద్రబాబు రంకెలు వేస్తున్నాడు. ఆ రచ్చకు తగ్గట్టుగానే పచ్చ మీడియా రెచ్చిపోతోంది. ఇక టిడిపి సపోర్టర్స్ అందరూ, అన్ని పార్టీలలో ఉన్న ఒక కులం జనాలందరూ తందానా అంటున్నారు. మరి అసలు నిజాలేంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియకుండా మేనేజ్ చేయాలని పచ్చ మీడియా చేస్తున్న కుట్ర ఏంటి? పోలింగ్‌కి ముందు నుంచీ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గెలవనివ్వకుండా చంద్రబాబు చేసిన కుట్రలు, పన్నిన వ్యూహాలు ఏంటి? ఇప్పుడు రీ పోలింగ్ నిర్వహించాలన్న ఈసీ నిర్ణయం వెనుక పచ్చ బ్యాచ్ చేసిన దారుణాలు ఏంటి? బడుగు బలహీనవర్గాలు, దళితులు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైనం ఏంటి? అసలు నిజాలు ఇవిగో…………సాక్ష్యాధారాలతో సహా.

చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాలలో రీ-పోలింగుకు ఎన్నికల సంఘం ఆదేశించటం మీద టీడీపీ భగ్గుమనటం ,వైసీపీ ఆహ్వానించటం అర్ధం చేసుకోదగ్గవే కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి కపటత్వం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

ఈనాడు,ఆంధ్రజ్యోతి చాలా అమయాకంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఈనాడు ఒకడుగు ముందుకేసి చెవిరెడ్డి-మత్తు యాత్ర అని ఊరుపేరులేని ఒక ఫోటోతో పెద్ద వార్త కూడా రాసింది.

పోలింగ్ ముగిసిన ఎన్నిరోజుల తరువాత రీ-పోలింగ్ జరపాలి?దీనికి సంబంధించి ఎలాంటి నియమనిబంధన లేదు.కౌంటింగ్ ముగిసిన తరువాత కూడా రీ-పోలింగ్ అంటారేమో అని బాబుగారు అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పులతో గతంలో గెలిచిన MLA ల ఎన్నిక రద్దయిన సందర్భాలు ఉన్నాయి, రీ-పోలింగ్ ఎంత పెద్ద విషయం?

రీ-పోలింగ్ మీద నిర్ణయానికి ఇన్నిరోజులు ఎందుకు ఆలస్యమయిందన్నా టీడీపీ ప్రశ్నకు మొదట సమాధానం చిత్తూర్ జిల్లా కలెక్టర్,రెండవ సమాధానం రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పాలి. వైసీపీ ,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదును చిత్తూర్ జిల్లా కలెక్టర్ ఎందుకు సీరియస్ గా పట్టించుకోలేదు?రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు వీడియో రికార్డింగ్ చూడలేదు?కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు నిర్ణయం తీసుకోవలసి వొచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరుపున ఈ సమస్యను విడవకుండ ఎవరో కేంద్ర ఎన్నికల సంఘం వరకు తీసుకెళ్ళటంతోనే ఇప్పుడు రీ-పోలింగ్ జరుగుతుంది.

ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే రీ-పోలింగ్ ఎందుకు?

ఇక్కడ ప్రశాంతంగా అది 95-100% పోలింగ్ జరగటమే అసలు సమస్య. 2018 జూలైలో, ఈ ప్రాంత దళితులు తమకు స్వేచ్ఛగా ఓటువేసుకునే అవకాశం కల్పించాలని,దాని కొరకు ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటుచేయాలని చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారిని సుధారాణికి విన్నవించుకున్నారు. సమస్యను అర్ధం చేసుకున్న సుధారాణి గారు కూడా తన రిపోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించి దళితులకు రక్షణ కల్పించి,వారు స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలిపించాలని recommend చేశారు. ఏమి జరిగిందో ఏమో కొన్ని నెలల వ్యవధిలోనే సుధారాణికి ట్రాన్స్ఫర్ వొచ్చింది.

2018 నవంబర్-డిసెంబర్ లలో తాశీల్ధార్ లోకేశ్వరి గారికి దళితులు ఇదే సమస్యను విన్నవించుకున్నారు,ఆవిడ కూడా దళితులు ఓటును వినియోగించటానికి చర్యలు తీసుకోవాలని తన రిపోర్టులో …ప్రతిఫలంగా ఆవిడకు transfer వొచ్చింది.

చంద్రగిరిని ఎలాగైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఎన్నికలకన్నా దాదాపు 8 నెలల ముందు 2018 సెప్టెంబర్లో పులిపర్తి నానిని అభ్యర్థిగా ప్రకటించి,నానిని గెలిపించుకొని రండి లేకుంటే తనవద్దకు రావొద్దని చంద్రగిరి నాయకులకు చెప్పారు. బహుశా పులిపర్తి నానినే టీడీపీ ప్రకటించిన మొదటి అభ్యర్ధీ అనుకుంటాను.

అప్పటి నుంచి నాని గ్రామాలలో పట్టుసాధించటానికి ప్రయత్నం మొదలు పెట్టాడు,తనవైపు రాని వారి మీద నాని అనుచరులు దౌర్జన్యాలు చేశారు,అనేక కేసులు కూడా నమోదయ్యాయి. ఒక యువకుడిని దొంగ పేరుతొ నాని అనుచరులు అమానుషంగా కొట్టిన వీడియో కూడా బయటకు వొచ్చింది.

చంద్రగిరి దళితుల నుంచి అనేక ఫిర్యాదులు వెళ్లటంతో జాతీయ SC ST కమీషన్ సభ్యుడు శ్రీరాములు గారు గత జనవరి 22-23 లలో చంద్రగిరిలో పార్యటించారు. ఇప్పుడు రీ-పోలింగ్ జరుగుతున్న రావిళ్లవారిపల్లి ,కమ్మపల్లి తదితర గ్రామాల నుంచి దళితులు శ్రీరాములును కలిసి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విన్నవించారు. ఆ ప్రాంతంలోని ఒక గ్రామంలోని స్కూల్లో దళిత ఆడపిల్లలు toiletకు వెళ్లారని నీటి సరఫరా ఆపిన విషయాన్ని కూడా SC ST కమీషన్ సభ్యుడు శ్రీరాములు దృష్టికి తీసుకెళ్లారు.

మొత్తంగా చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో రీ-పోలింగ్ జరగటం వెనుక కేవలం వైసీపీ ఫిర్యాదు మాత్రమే కారణం కాదని అర్ధం అవుతుంది. అసలు ఏ ఫిర్యాదు లేకపోయినా 100% పోలింగ్ జరిగిన బూత్ ల మీద ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెడుతుంది.

ఇప్పుడు రీ-పోలింగ్ జరగటం వలన దళితులూ స్వేచ్ఛగా ఓటు వెయ్యగలరా?ఫలితం మారుతుందా?చెప్పలేము కానీ 1999 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి గాదె వెంకట్ రెడ్డి సొంత ఊరు పావులూరు లో టీడీపీ ఘర్షణ వాతావరణం సృష్టించి రీ-పోలింగ్ జరిగేలా చేశారు,సులభంగా గెలుస్తారన్న గాదె వెంకట్ రెడ్డి 2,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

చంద్రగిరిలో గత ఎన్నికల్లో చెవిరెడ్డి 4,500 మెజారిటీతో గెలిచారు.చంద్రగిరిలో 20 వేల మెజారిటీ ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు. ఈ ఎన్నికల్లో కూడా పోటా పోటీగా ఎన్నిక జరిగింది అనుకుంటున్నా వాతావరణంలో టీడీపీ కి 95-100% పోలయిన ఊర్లలో రీ-పోలింగ్ అంటే ఒత్తిడికి గురవుతున్నట్లున్నారు.

ఎన్నికల కమీషన్ రీ-పోలింగ్ కు ఆదేశించి చేతులు కడుక్కోలేదు, అధికార పక్షానికి సహకరించి పోలింగ్ అధికారి,సహాయ అధికారులను కూడా సస్పెండ్ చేసింది.EC దగ్గర వీడియో సాక్షాలు ఉన్నాయని ద్వివేది చెప్పారు. ఆంధ్రజ్యోతి మరి మిగిలిన కేసుల విషయం ఏంటి అని అడిగింది,వీడియో సాక్షాలు అది కూడా పోలింగ్ జరుగుతున్నప్పుడు webcasting లో నమోదు అయ్యుంటే EC కి అందచేయ్యండి,వాళ్ళు నిర్ణయం తీసుకోకుంటే కోర్టు ఎలాగూ ఉంది.

ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోతుంది అని టిడిపి ముఖ్యనాయకుడు రెచ్చిపోయి మాట్లాడాడంటేనే ఆ ఏదో చేస్తున్న అసలు నాయకుడు ఆయనే అని చెప్పి ఈ విషయాలన్నీ విశ్లేషించిన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. తాను చేయాలనుకున్న, చేస్తున్న కుట్రలన్నీ ప్రత్యర్థులు చేస్తున్నారని ముందుగానే టముకు వేయడం, చేస్తున్న పని అస్సలు చెప్పకపోవడం, చేయలేని పనులన్నీ భజన స్థాయిలో చెప్పుకోవడం ఆ ముఖ్యనాయకుడి లక్షణాలు మరి. ఏం చేస్తాం అని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -