Sunday, May 19, 2024
- Advertisement -

ఆ పాప కి అప్పుడే పెళ్ళా ?

- Advertisement -

ఐ యాం వెరీ గుడ్ గర్ల్ అంటూ లిటిల్ సోల్డ్జర్స్ సినిమా లో అప్పట్లో సందడి చేసిన పిల్లని మనం ఎప్పటికీ మరచిపోలేం. ఆ పాప పేరు కావ్య అని అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలీదు. ఆమె ఇప్పుడు చాలా పెద్దదైంది ఎంత పెద్దది అంటే ఆమె పెళ్లి కూడా సెట్ అయ్యిందట.

బేబీ షామిలీ, బేబీ శాలినీ వంటి వారిని గుర్తు తెచ్చుకుంటే వెంటనే జగదేక వీరుడు – అతిలోక సుందరి సినిమా మరేదైనా సినిమా గుర్తు తెచ్చుకుంటాం అలాగే లిటిల్ సోల్జర్స్ సినిమా చూస్తే ఈ పాపని గుర్తు తెచ్చుకుంటాం అన్న మాట. 1996 లో విడుదల అయిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. చిన్న పిల్లల సినిమాలు ఎదో ఉడతా భక్తి గా తీసే సమయంలో ఒక తక్కువ బడ్జెట్ చిత్రం బ్లాక్ బస్టర్ అవడం చాలా పెద్ద సంచలనం అయ్యింది ఆ రోజుల్లోనే.  

అందులో ఆ పాప కి అన్నయ్య గా చేసిన  కుర్రాడు బాలాదిత్యా హీరో ప్రయత్నాలు చేసి విరమించగా ఆమె మాత్రం హీరోయిన్ లాంటివి ఏమీ ట్రై చెయ్యలేదు, త్వరలో అయి కుషాల్ హిప్పలగావోంకర్ అనే కుర్రాడిని పెళ్లాడబోతోంది. ఇటీవలే ఎంగేజ్ మెంట్  కార్యక్రమం పూర్తయింది.

లేటెస్ట్ గా రిసెప్షన్ ఘనంగా ఏర్పాటు చేశారని సమాచారం.  ఆ తరం లో లిటిల్ సోల్జర్స్ సినిమా చూసిన వాళ్ళంతా ఆ పాప కి అప్పుడే పెళ్ళా అంటున్నారు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -