హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం లాక్డౌన్. ఈ సినిమా ముందుగా 2026 జనవరి 30న తమిళంలో థియేటర్లలో విడుదలైంది. అయితే పలుమార్లు వాయిదా పడిన తర్వాత విడుదలైన ఈ చిత్రానికి పెద్దగా బజ్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు.
ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో విఫలమైన ఈ సినిమా ఓటీటీలో ఎలా స్పందన పొందుతుందో చూడాల్సి ఉంది.
ఈ చిత్రంతో ఏఆర్ జీవ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్తో పాటు నిరోషా, చార్లీ, ప్రియా వెంకటర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, సంగీతాన్ని సిద్ధార్థ్ విపిన్ అందించారు.
