గతంలోనే త్రిష, రాణాల మధ్య బంధం గురించి అనేక వార్తలు వచ్చాయి. ఆమె అతడి ప్రేమలో చాలా ఊరటపొందిందని త్రిషను బాగా ఎరిగిన వారు చెప్పేవారు. త్రిషకు రాణా ఎంతో సపోర్టివ్ గా ఉన్నాడని..
వారు ప్రేమను బహిర్గతం చేయడం లేదు కానీ.. లోలోపల మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని రూమర్లు వినిపించేవి. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వారి మధ్య దూరం పెరిగింది. ఉన్నట్టుండి త్రిష పెళ్లి నిర్ణయాన్ని తీసుకొంది.
వరుణ్ మణియన్ తో ఆమె పెళ్లి నిశ్చితార్థం వరకూ వెళ్లి ఆగిపోయింది. మరి అప్పటి నుంచి త్రిష కాస్త డల్ గానే కనిపిస్తోంది. అయితే ఆమె ప్రేమ, పెళ్లి వంటి అంశాల గురించి మాత్రం పెద్ద పెద్ద లెక్చర్లే ఇస్తోంది. పెళ్లి చేసుకొనే ముందు బాగా ఆలోచించాలని.. జీవితం వారితో బాగుంటుందని బలంగా నమ్మితేనే పెళ్లి చేసుకోవాలని.. లేకపోతే అలాంటి బంధానికి మొదట్లోనే తలాక్ చెప్పాలని త్రిష పాఠాలు చెబుతూ వస్తోంది.
మరి ఈ విధంగాపెద్ద పెద్ద మాటలు.. చెబుతున్న ఈ భామ ఇప్పుడు తిరిగి రాణాకు దగ్గరయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సైమా అవార్డుల సందర్భంగా వీళ్లిద్దరి మధ్యనా మళ్లీ సాన్నిహిత్యం పెరిగిందని.. ఒకరి కంపెనీని మరొకరు బాగాఆస్వాధించారని టాక్ వస్తోంది. మరి నిశ్చితార్థంతో ఆగిపోయిన పెళ్లి విషయంలో మిగిలిన చేదు అనుభవం మరిచిపోవడానికి త్రిష ఈ విధంగా బిజీ అయిపోయినట్టుగా ఉంది.