- Advertisement -

విజయ్ సినిమా ఆలస్యంపై రాహుల్!

- Advertisement -

ఇళయ దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. ఈ సినిమా రిలీజ్ ఆలస్యంపై స్పందించారు ఎంపీ రాహుల్ గాంధీ. జన నాయగన్‌ను అడ్డుకోవడానికి కేంద్రం చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి అని అభివర్ణించారు రాహుల్. ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడితో సమానమని ఆయన విమర్శించారు.

మరోవైపు విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ LLP, ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2026 జనవరి 9న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిర్మాతలు తమ పిటిషన్‌లో సవాలు చేశారు. అంతకుముందు సింగిల్ బెంచ్, ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికేట్ ఇవ్వాలని CBFCను ఆదేశించగా, ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ సర్టిఫికేషన్ ప్రక్రియపై స్టే విధించింది.

జనవరి 9 తేదీన మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని ఎక్స్‌పార్టే ఇంటరిమ్ స్టే లేదా అడ్ఇంటరిమ్ స్టే ఇవ్వాలని నిర్మాతలు సుప్రీంకోర్టును కోరారు. అవసరమైతే న్యాయస్థానం తగిన ఇతర ఉపశమనాలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో ప్రార్థించారు. ఇదిలా ఉండగా, CBFC కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని కోరుతూ దాఖలు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -