ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. జాతీయ పార్టీ బీజేపీ కూడా ఏపీలో తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితాలో అనుహ్యాంగా చోటు సంపాదించుకుంది సినీనటి మాధవిలత. ఆమె గుంటూరు జిల్లా వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదివారం నాడు బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆమె పేరును ప్రకటించారు. బీజేపీ పార్టీ తనకు టికెట్ కేటాయించడంతో మాధవిలత పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు చెప్పారు.
టికెట్ ప్రకంచిన వెంటనే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు మాధవిలత . సోషల్ మీడియాలో తనను గెలిచించాలని మాధవిలత కోరింది. గుంటూరు జిల్లా ప్రజలు తనను ఖచ్చితంగా గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేసింది. అయితే ఆమెకు తెలంగాణలో సీటు ఇస్తారని అందరు భావించారు , కాని అనుహ్యాంగా గుంటూరు జిల్లా నుంచి మాధవిలతను పోటీలో దించి షాకిచ్చింది బీజేపీ అధిష్టానం. మరి ఆమె సినీ గ్లామర్ ఈ ఎన్నికల్లో ఎంతమేరకు పని చేస్తుందో చూడాలి.
- Advertisement -
ఈ హీరోయిన్‌కు ఓట్లు వేసేంత సీన్ ఉందా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -