Thursday, May 2, 2024
- Advertisement -

ఈసారైనా చంద్రబాబు కోరిక నెరవేరేనా!

- Advertisement -

ఏపీలో అధికారం దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు వెళ్తుండగా తాజాగా ఈ కూటమిలో బీజేపీ చేరడం దాదాపు ఖాయమైంది. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత కొన్ని స్థానాల్లో ఇప్పటికే ఆ పార్టీనే గెలుస్తూ వస్తుండగా మరికొన్ని స్థానాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.

ఇందులో ఒకటి గుంటూరు తూర్పు. చివరి సారిగా ఈ స్థానం నుండి టీడీపీ గెలిచింది 1994లోనే. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. చివరిసారిగా జియావుద్దీన్ ఇక్కడి నుండి గెలవగా ఆ తర్వాత టీడీపీ గెలిచింది లేదు. ఎంతమంది మంది నేతలు ప్రయత్నించినా గెలుపుమాత్రం దక్కలేదు.

ఇక్కడి నుండి ప్రతీ ఎన్నికల్లో అభ్యర్థిని మారుస్తూ వస్తున్నారు చంద్రబాబు. నజీర్, మద్దాలిగిరి, మొహ్మద్ నజీర్ ఇలా 1999 నుండి వరుసగా పోటీచేయగా గెలుపుబాట మాత్రం పట్టలేదు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ విజయబావుటా ఎగురవేసింది. ఎమ్మెల్యేగా ముస్తాఫా గెలవగా ఈసారి జగన్ ఆయన కూతురు ఫాతిమాకు టికెట్ ఇచ్చారు. ఈసారి టీడీపీ తరపున కూడా మహిళా అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావిస్తుండగా మరిసారైన గుంటూరు తూర్పులో గెలవాలన్న చంద్రబాబు కోరిక నెరవేరుతుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -