Sunday, April 28, 2024
- Advertisement -

నన్ను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోండి లేదంటే మౌనదీక్షకు దిగుతాను!

- Advertisement -

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత సోషల్ మీడియాలో తనపై వస్తున్న దుష్ప్రచారాలపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. ఈ మద్య సోషల్ మీడియాలో లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారని.. తనను టార్గెట్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుందని మాధవీలత అన్నారు. మొదటి నుండి నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

దేవాలయాల అంశం గురించి మాట్లాడటంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఓ వర్గం తనను టార్గెట్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతుందని అన్నారు. అంతే కాకుండా ఎక్కడైనా అమ్మాయిలు పట్టుబడితే.. అందులో తాను కూడా పట్టుబడినట్లు ప్రసారం చేస్తున్నారని మాధవీలత అన్నారు.

వాట్సాప్ లలో కొన్ని గ్రూపులు స్క్రీన్ షాట్ లు చేసి మరి ఫార్వర్డ్ చేస్తున్నారు. పోలీసులు వారిని పట్టుకోకపోతే మౌనదీక్షకు దిగుతాను అంటూ మాధవీ లత తెలిపారు. తాను హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తుంటానని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని తేల్చి చెప్పారు. అయితే ఈ విధంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటుకు 5 వేలు.. సరిపోవంటే 10 వేలు తీసుకోండి!

బాబు మాటలతో విస్మయానికి గురైన క్యాడర్!

ఈట‌ల‌ను సీఎం చేస్తే త‌ప్పేంటి?

https://twitter.com/actressmadhavi/status/1357304145657569285?s=20

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -