Monday, April 29, 2024
- Advertisement -

సింగిల్ కట్ కూడా లేదు……. ‘అద్భుతం’ అన్న ప్రశంశ తప్ప…. మహానటి సెన్సార్ డిటెయిల్స్

- Advertisement -

మహానటిగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేంత గొప్ప పేరు తెచ్చుకున్న అలనాటి మేటి నటి సావిత్ర జీవితకథతో తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమా సెన్సార్ పూర్తయింది. అందరూ కూడా మహానటి సినిమా అంటే ట్రాజెడీ స్టోరీ అనుకుంటున్నారు కానీ ట్రాజెడీ అస్సలు కాదని సెన్సార్ సభ్యులు కొత్త విషయం చెప్పారు. సినిమా అంతా కూడా కంప్లీట్ ఎంటర్టైన్‌మెంట్‌తో ఉంటుందని……చివరి నిమిషాలు మాత్రం హృదయానికి హత్తుకునేలా ఉంటాయని సెన్సార్ సభ్యులు చెప్పారు.

సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సింగిల్ కట్ కూడా లేకుండా సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చారు. మహానటి లాంటి గొప్ప సినిమాను తీసిన నాగ్ అశ్విన్‌ని వేనోళ్ళ ప్రశంశించారు. ఇంతకుముందు ఎవడే సుబ్రమణ్యం సినిమాకు కూడా అందరి ప్రశంశలూ దక్కించుకున్న నాగ్ అశ్విన్………మహానటి సినిమాతో తెలుగు సినిమా చరిత్రలోనే గొప్పది అనదగ్గ సినిమాను తెరకెక్కించాడని సెన్సార్ సభ్యులు ప్రశంశించారు. సినిమాలో విజయ్ దేవరకొండ-సమంతాల మధ్య హిలేరియస్ ఫన్నీ సీన్స్ ఉంటాయని చెప్పారు. ఇక మహానటి జీవితకథను కూడా విషాదంలా కాకుండా సినిమా చూసినవాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చేలా గొప్పగా చిత్రీకరించాడట నాగ్ అశ్విన్. సమంతా యాక్ట్ చేసిన రెండు మూడు బెస్ట్ సీన్స్ అయితే సినిమా అయ్యాక కూడా చాలా కాలం హాంట్ చేస్తాయని సెన్సార్ మెంబర్స్ ప్రశంశిస్తున్నారు. ఏది ఏమైనా సింగిల్ కట్ కూడా లేకుండా యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు మహానటి సినిమాను సెన్సార్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వేనోళ్ళ ప్రశంశించడంపై మహానటి టీంలో అమితానందం వ్యక్తమవుతోంది. ఇలాంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని……..మంచి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ వచ్చేంతగా స్ఫూర్తినిచ్చే స్థాయిలో సక్సెస్ అవ్వాలని మనమూ కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -