Monday, May 6, 2024
- Advertisement -

లోకేష్ వద్దే వద్దు…… బ్రాహ్మిణి కావాలన్న టిటిడిపి నేతలు… బాబు స్పందన ఇది

- Advertisement -

తెలంగాణా తెదేపా నేతలు నారా లోకేష్‌పై ఏ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారో మరోసారి స్పష్టమైంది. నారా లోకేష్ నాయకత్వ సామర్థ్యంపై తెలంగాణా తెదేపా నేతలు మరోసారి తమ అభిప్రాయాలను స్పష్టంగా చంద్రబాబుకు తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చినట్టుగానే 2019 ఎన్నికల్లో తెలంగాణాలో తెదేపాని అధికారంలోకి తెస్తానని 2014 ఎన్నికల తర్వాత ప్రగల్భాలు పలికాడు లోకేష్. హైదరాబాద్‌లోనే పుట్టా……..తెలంగాణా ముద్దుబిడ్డను అని తెలంగాణా తెదేపా వ్యవహారాలు చూసుకున్నాడు. తెలంగాణా ప్రజల మెప్పు పొందాలని చూశాడు. తెలంగాణాలో పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చెయ్యొచ్చునని బాబు కూడా ఆలోచించాడు.

అయితే ఓటుకు కోట్లు ఎఫెక్ట్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి పూర్తిగా పాతాళానికి పడిపోవడం లాంటి పరిణామాలతో నారా లోకేష్ నాయకత్వం అంటేనే తెలంగాణా తెదేపా నేతలు భయపడుతున్నారు. తాజాగా తెలంగాణా నేతలతో సమావేశమైన చంద్రబాబు నెలలో రెండు మూడు సార్లు తెలంగాణాలో నారా లోకేష్ పర్యటన ఉండేలా చూస్తానని చెప్పాడట. ఆ వెంటనే తెలంగాణా తెదేపా నాయకులందరూ కూడా లోకేష్ వద్దే వద్దు అని కరాఖండీగా చెప్పేశారట. కావాలంటే నారా బ్రాహ్మిణిని పంపిచండి. ఎన్టీఆర్ మనవరాలిగా పార్టీకి ఉపయోగపడుతుంది అని చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం బ్రాహ్మిణికి రాజకీయాలంటే ఇష్టం లేదు…….ఆమె ఎప్పటికీ రాజకీయాల్లోకి రాదు అని చెప్పాడట. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెదేపాను తెలంగాణాలో కూడా అధికారంలోకి తీసుకురావడం ఎలా అని తనదైన స్టైల్‌లో స్పీచ్ దంచాడు చంద్రబాబు. షరా మామూలుగానే బాబు ప్రసంగాన్ని వింటున్న సమయంలో కూడా తెలంగాణా తెదేపానేతల మోములపై నవ్వుల పువ్వులు కనిపించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -