ప్రభుదేవ – కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రానికి చరణ్ తేజ్ దర్శకత్వం వహిస్తుండగా నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో టీజర్‌ని రిలీజ్ చేశారు.టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ అత్యద్భుతంగా ఉన్నాయి.ప్రభుదేవా స్వాగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయి. బ్యూటీ సంయుక్త మీనన్ చాలా ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఎంట్రీ అద్భుతంగా ఉండగా జాతరలో ఫైట్ చేసే సీన్,డైలాగ్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది.
జీకే విష్ణు మహారాగ్ని చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా టీజర్ కట్ చేసిన విధానం కట్టిపడేసింది. చాలా కాలం తర్వాత ప్రభుదేవ – కాజల్ జంటగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం ఖాయం అని మేకర్స్ చెబుతున్నారు.