Wednesday, May 8, 2024
- Advertisement -

సలామ్ వెంకీ అంటున్న స్టార్ హీరోయిన్స్

- Advertisement -

ఒకరు సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. మరొకరు బాలీవుడ్‌లో మొన్నటివరకు బిజియెస్ట్ హీరోయిన్. ఆ ఇద్దరూ కలిసి సలామ్ వెంకీ అంటున్నారు. సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ తార కాజోల్ నటిస్తున్న చిత్రం సలామ్ వెంకీ. బిలైవ్ ప్రొడ‌క్ష‌న్స్, టేక్23స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సూర‌జ్‌సింగ్, శ్ర‌ద్ధా అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని కొన్ని నెలల క్రితం ‘ద లాస్ట్ హుర్రే’ పేరుతో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ‘సలామ్ వెంకీ’గా మార్చారు. ఇదొక తల్లి కథ. ఆమె జీవితంలో అనుకోకుండా చాలా సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని చివరికి విజయం ఎలా సాధించిందనేది థీమ్. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నారు రేవతి. పెళ్లి తర్వాత హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

ఇప్పటికే తల్లీబిడ్డల చుట్టూ తిరిగే హెలికాప్టర్ ఈలా, త్రిభంగా చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి అలాంటి కాన్సెప్ట్‌నే ఎంచుకుంది. కాకపోతే రేవతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మిత్ర్ మై ఫ్రెండ్, ఫిర్ మిలేంగే చిత్రాలతో అద్భుతమైన డైరెక్టర్‌‌గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి. ‘మిత్ర్’ చిత్రానికైతే నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. మరి సలామ్ వెంకీలో ఏ మాయ చేయబోతున్నారో చూడాలి.

Also Read

వివాదాస్పద సెలబ్రిటీలతో కంగనా లాక్‌అప్

పాన్ ఇండియా మూవీగా శక్తిమాన్

డీజే టిల్లు ఎలా ఉందంటే ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -