Monday, May 20, 2024
- Advertisement -

బర్త్‌డే రోజు షూరు చేసిన మ‌హేశ్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకు వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు.అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు ఇద్ద‌రు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం మ‌హేశ్ గడ్డం, మీసం పెంచి డిఫరెంట్‌ గెటప్‌లోకి దిగిపోయారు.ఈ నయా లుక్‌కి చెందిన ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

వ‌చ్చే నెల మ‌హేశ్ పుట్టినే రోజు సంద‌ర్భంగా సినిమాలో మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ అండ్‌ టైటిల్‌ను మహేశ్‌బాబు బర్త్‌డే స్పెషల్‌గా ఈ ఏడాది ఆగస్టు 9న రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోందట. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -