Sunday, May 12, 2024
- Advertisement -

ఆమ్మో.. పోలీసు కారెక్టర్ వద్దు అంటున్న స్టార్ హీరో

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి ప్రచార పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా విజయవంతంగా నడుస్తుండడం తో మహేష్ కూడా తన ట్రిప్ ని మానుకొని కలెక్షన్స్ ని ఇంకా బూస్ట్ చేసే పని లో ఉన్నాడు అని టాక్. మహర్షి తర్వాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడు. అయితే మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా దూకుడు, ఆగడు తరహా లో పూర్తి మనోరంజకంగా ఉండబోతుంది అంట. అయితే ఆ రెండు సినిమా ల మాదిరి గా నే మహేష్ బాబు ఈ సినిమా లో కూడా ఒక పొలిసు పాత్ర లో కనిపించనున్నాడా అనే వార్తలు బయటకి వచ్చిన నేపథ్యం లో ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో మహేష్ బాబు పోలీసు గా చేయడం లేదు అట. పోలీసు పాత్రలు చేసి విసుగొచ్చింది అని, మళ్ళి మళ్ళి అదే తరహా లో పాత్రలు చేయడం ఇష్టం లేక ఈ సారి పోలీసు పాత్ర ని వద్దు అనుకుంటున్నాడట. ఇదే విషయం అనిల్ కి కూడా చెప్పి కాస్త ఎంటర్టైనింగ్ గా తన పాత్ర ఉండేలా చూసుకోమని సూచన చేసాడట మహేష్. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -