Monday, May 13, 2024
- Advertisement -

మ‌హేష్ ఏంటీది!

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌రత్ అను నేను సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. రెండు ప్లాప్‌ల త‌రువాత హిట్ కొట్ట‌డంతో మ‌హేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.సినిమాలో మ‌హేష్ యంగ్ సీఎంగా చేసిన న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు.సినిమా ఈ రేంజ్‌లో హిట్ కావ‌డానికి కార‌ణం ఎవ‌రంటే మ‌హేష్ భార్య న‌మ్ర‌త అంటున్నారు. న‌మ్ర‌త కార‌ణం ఎలా అంటే సినిమా ప‌బ్లిసిటి మొత్తం న‌మ్ర‌త‌నే చూసుకున్నారు.శ్రీమంతుడు ప‌బ్లిసిటి కూడా న‌మ్ర‌త‌నే చూసుకున్నారు. ఆ సినిమా సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డం జ‌రిగింది. తరువాత కుటుంబ ప‌రిస్థితుల కార‌ణంగా మ‌హేష్ సినిమాల‌కు కొంచెం దూరంగా ఉన్నారు న‌మ్ర‌త‌. ఈ లోపు మహేష్‌కు రెండు భారీ ఫ్లాప్‌లు వ‌చ్చాయి.

భ‌ర్త సినిమాను ఎల‌గైనా హిట్ చేయ‌ల‌ని ఆలోచ‌న‌తో రంగంలోకి దిగింది మ‌హేష్ భార్య న‌మ్ర‌త‌.న‌మ్ర‌త ఈ సినిమా కోసం ఓ టీం ఏర్పాటు చేసుకుని సినిమా గురించి సోష‌ల్ మీడియాలో విసృత ప్ర‌చారం చేసింది. సిటీ మొత్తం పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది.సినిమాపై బ‌జ్ ఉండేలా చూసుకుంది.ప్ర‌మోష‌న్స్‌ని ప‌క్క‌గా ప్లాన్ చేయ‌డంతో సినిమాకు హిట్ టాక్ వ‌చ్చింది. మ‌హేష్ త‌న ఆనందాన్ని ఫోటో రూపంలో పోస్ట్ చేశాడు.హేశ్ తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే మహేశ్‌ ఇలాంటి ఫొటో ఎప్పుడూ పోస్ట్‌ చేసి ఉండరు.ఆ ఫొటోలో మహేశ్‌ తన భార్యను ముద్దాడుతూ కన్పించారు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ‘థాంక్యూ మై లవ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. బహుశా మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన నేపథ్యంలో క్రెడిట్‌ అంతా తన భార్యకు అంకితం చేస్తూ ఈ ఫొటో పోస్ట్‌ చేశారేమో!

 

https://www.instagram.com/p/Bh16wAQHS3m/?taken-by=urstrulymahesh

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -