Thursday, May 2, 2024
- Advertisement -

భరత్ అను నేను…… ఆ రెండు ఎపిసోడ్స్‌లో విజిల్స్ మోత మోగిపోతుందట

- Advertisement -

భరత్ అను నేను సినిమాపై హీరో మహేష్ బాబు, డైరెక్టర్ కొరటాల శివలు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే ఇద్దరిదీ ఓవర్ కాన్ఫిడెన్సా అన్న అనుమానాలను వాళ్ళ దగ్గరే జర్నలిస్టులు వినిపించారు. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ఎందుకు అంత నమ్మకంగా ఉన్నారో జర్నలిస్టులకు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకూ తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ సమయంలో మరీ ఎక్కువగా మాట్లాడని మహేష్ భరత్ అను నేను విషయంలో మాత్రం డెఫినిట్ బ్లాక్ బస్టర్ అని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. ఇంతకూ మహేష్, కొరటాల శివలు భరత్…బ్లాక్ బస్టర్ అని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణం ఏంటంటే……..?

మిర్చి, శ్రీమంతుడు సినిమాలలో కొరటాల రాసిన లవ్ ట్రాక్ సూపర్బ్‌గా హైలైట్ అయింది. జనతా గ్యారేజ్ విషయంలో మాత్రం కాస్త ఎఫెక్ట్ తగ్గింది. అయితే ఇప్పుడు భరత్ అను నేను సినిమాలో మహేష్-కైరాదత్ లవ్ స్టోరీ ట్రాక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే హైలైట్ ఎపిసోడ్‌గా నిలిచిపోయే స్థాయిలో ఉంటుందని ఈ సినిమా మేకర్స్ చెప్తున్నారు. హీరో, హీరోయిన్స్ మధ్య లవ్, ఫన్ ఎలిమెంట్స్ అద్భుతంగా ఎలివేట్ అయ్యాయని చెప్తున్నారు. ఇక హీరో బాధ్యతను హీరోయిన్ పంచుకోవడం కూడా చాలా బాగుంటుందని చెప్పారు. లవ్ సీన్స్‌లో మహేష్ బాబు పెర్ఫార్మెన్న్ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్ ఒకటి థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చే స్థాయిలో ఉంటుందట. ఒక పేద విద్యార్థిని సమస్య చుట్టూ నడిచే ఆ ఎపిసోడ్ బెస్ట్‌గా నిలిచిపోతుందని చెప్తున్నారు. అలాగే మహేష్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అని శివ చెప్తున్నాడు. భరత్ అను నేను సినిమా సాంగ్స్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ తన స్టాండర్డ్స్ రేంజ్‌లో మ్యూజిక్ ఇవ్వలేకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఆడియోలో రెండు సాంగ్స్ మాత్రమే ఛార్ట్ బస్టర్స్ అయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సిినిమాను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళే స్థాయిలో ఉంటుందని భరత్ అను నేను టీం చెప్తోంది. మహేష్, కొరటాల కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం భరత్ అను నేను సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలానే ఉందని క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -