Friday, May 17, 2024
- Advertisement -

కేంద్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌తో బాబు గంటన్నర భేటీ వెనుక రహస్యం ఏంటి?

- Advertisement -

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ డైరెక్టర్ రాజీవ్ జైన్ చంద్రబాబుతో గంటన్నర పాటు సమావేశమయ్యాడు. అధికారికి షెడ్యూల్‌లో లేనప్పటికీ గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏం జరిగింది అన్న విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవహారం కూడా అనుమానాలు రేకెత్తేలా ఉంది. ఇంత అర్జెంట్‌గా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధ్యక్షుడు బాబును ఎందుకు కలవాల్సి వచ్చింది? అది కూడా గంటన్నర సేపు ఇద్దరి మధ్యా ఏ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి?

ఎక్కువ మంది చెప్తున్న సమాధానం మాత్రం ఒక్కటే. మోడీ విషయంలో రెచ్చిపోతున్న చంద్రబాబు దగ్గరకు రాజీవ్ జైన్‌ని మోడీనే పంపించాడని చెప్తున్నారు. చంద్రబాబు అక్రమాలు, అవినీతి వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలను బాబుకు సాక్ష్యాలతో సహా వివరించడం జరిగిందని చెప్తున్నారు. మోడీ వైపు నుంచి చంద్రబాబుకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని ఒక వర్గం జనాలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టిడిపి నాయకులు, శ్రేణుల్లో కూడా ఆందోళన నెలకొని ఉంది.

ఇక మరో వర్గం జనాలు మాత్రం మోడీతో కాంప్రమైజ్ అవ్వడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని ….అందుకే విజయ్ జైన్‌తో సమావేశమయ్యి మోడీకి తన రాయబారం పంపించాడని చెప్తున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ మోడీకే మద్దతు ఇస్తామని టిడిపి ఎంపి జేసీ దివాకరరెడ్డి స్పష్టం చేశాడు. ఇక బిజెపి నాయకులు కూడా టిడిపితో మళ్ళీ కలవడానికి సిధ్ధం అని చెప్పారు. అమిత్ షా కూడా బాబుతో విభేదాలు లేవు అని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోడీపై ఆగ్రహం ఉన్నందునే బయటికి రావాల్సి వచ్చిందని…2019 ఎన్నికల తర్వాత మాత్రం కచ్చితంగా బిజెపికి, మోడీకే తన మద్దతు ఉంటుందని చెప్పి మోడీకి రాయబారం పంపించాడని చెప్తున్నారు.

అయితే పచ్చ బ్యాచ్ జనాలు, మీడియా మాత్రం షరా మామూలుగానే గంటన్నరపాటు రాష్ట్ర ప్రయోజనాల గురించే బాబు చర్చించాడని చెప్తున్నారు. అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌తో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాడని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల గురించి చర్చించాడని చెప్పడం మాత్రం కామెడీగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఎప్పటికి భయపడుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -