Tuesday, May 6, 2025
- Advertisement -

మహేష్ బర్త్ డే..50 రోజుల ముందే మొదలైన ఫ్యాన్స్ హంగామా..!

- Advertisement -

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఓ మోస్తరు టాక్ వచ్చినా ఆయన నటించిన సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. మహేష్ బాబుకు మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా ఏ వేడుక అయినా సోషల్ మీడియాలో అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు.

ఇక మహేష్ బర్త్ డే వస్తే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ ఏడాది కూడా మహేష్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సందర్భంగా 50 రోజుల ముందే వేడుకలు ప్రారంభించారు. #ReigingSSMBBdayin50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ఇండియా లెవెల్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. ఆ హ్యాష్ ట్యాగ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది అంటే ఎంత ట్రెండ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ సందర్భంగా మహేష్ బాబు బర్త్ డే సీడీపీని కూడా రిలీజ్ చేశారు. ఈ హ్యాష్ ట్యాగ్ కి సోషల్ మీడియాలో ట్వీట్లు, రికార్డు స్థాయిలో లైక్స్ మోత మోగుతున్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాటకు సంబంధించి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. కనీసం మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా అయినా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మహేష్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ రావడం గ్యారెంటీ అని టాక్ వినిపిస్తోంది.

Also Read

విడుదలకు ముందే లైగర్​ రికార్డులు.. 

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -