Thursday, April 25, 2024
- Advertisement -

షాకింగ్ః మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా…. ఎప్పుడంటే?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్నా పెద్ద హీరోలందరూ కూడా దర్శకత్వంలో వేలు పెట్టేవాళ్ళే. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళయితే అన్ని విషయాల్లోనూ తల దూర్చుతూ ఉంటారు. కానీ ఇతర హీరోల్లో చాలా మంది మాత్రం కథ, దర్శకత్వం విషయంలో కాళ్ళూ, చేతులూ పెట్టేస్తూ ఉంటారు. అయితే ఒకే ఒక్క హీరో మాత్రం అందుకు పూర్తి మినహాయింపు. అతడే సూపర్ స్టార్ మహేష్ బాబు.

అలాంటి మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం కూడా చేస్తానంటున్నాడు. ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తన దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను చూడాలంటే మాత్రం ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. అదే విషయాన్ని మహేష్ కూడా చెప్పుకొచ్చాడు. దర్శకత్వం చేయడం అయితే ఖాయం అని…… అయితే తన దర్శకత్వంలో సినిమా తెరకెక్కాలంటే ఇంకా చాలా టైం పడుతుందని చెప్పాడు. సినిమా గురించి పూర్తి అవగాహన వచ్చాక….. నటుడిగా తనకు పూర్తి స్థాయి సంతృప్తి దొరికాక అప్పుడు దర్శకత్వం చేస్తానని చెప్తున్నాడు మహేష్. అప్పటి వరకూ హీరోగా చేస్తున్నంత కాలం డైరెక్టర్స్ పనిలో అస్సలు వేలు పెట్టనని…….. డైరెక్టర్ చెప్పినదానిని గుడ్డిగా చేసుకుంటూ పోతానని చెప్పుకొచ్చాడు మహేష్. డైరెక్టర్స్ చెప్పినట్టుగా వింటేనే తనకు కొత్త కొత్త సినిమాలు వస్తాయని…..తనతో సినిమా చేసేటప్పుడు డైరెక్టర్స్ కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు. హిట్స్…..ఫ్లాప్స్ కంటే కూడా కెరీర్ కొత్తగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. భరత్ అను నేను సినిమాకు సూపర్ హైప్‌తో పాటు మహేష్ కెరీర్‌లోనే ది బెస్ట్ అనే స్థాయిలో బిజినెస్ జరిగింది. త్వరలో రిలీజ్ కానున్న సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -