సూపర్ స్టార్ మహేష్ బాబు.. బయట పంక్షన్ లకు పెద్దగా వెళ్లారు. ఎప్పుడో తనకు దగ్గరు అయిన వాళ్లు కానీ.. తనకు నచ్చిన పంక్షలకు గానీ వెళ్తుంటారు. అయితే.. రీసెంట్ గా మహేష్ బాబు అతిథిగా ఓ ప్రోగ్రాం కి వెళ్ళారు. ప్రోగ్రాం అంత కంప్లీట్ అయ్యాక.. లంచ్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.
మహేష్ బాబు కూడా ఈ లంచ్ లో పాల్గొన్నాడు. అయితే లంచ్‌లో పెట్టిన స్వీట్‌లో జెర్రి కనిపించింది. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నఈ సంస్థ.. ఇటివలే వెబ్ సిరిస్ ను మొదలు పెట్టింది. అయితే హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో ఆ ప్రోగ్రాంను లాంచ్ చేశారు మహేష్. అయితే ఈ ప్రోగ్రాం కంప్లీట్ అవ్వడంతో.. వచ్చిన అతిథులకు లంచ్ ఏర్పాటు చేశారు. పలువురు అతిథులు లంచ్ చేస్తుండగా.. ఓ వ్యక్తి తింటున్న స్వీట్‌లో జెర్రి కనిపించింది. దాంతో క్యాటరింగ్ వాళ్లను ప్రశ్నించగా.. అప్పుడు అప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని అవన్ని పట్టించుకుంటే క్యాటరింగ్ చేయలేం అని జవాబు ఇచ్చారట.
Related