Thursday, May 16, 2024
- Advertisement -

మహేష్ మూవీ షూటింగ్ స్పాట్ కి వెళ్లిన మెగాస్టార్!

- Advertisement -
Chiranjeevi On The Sets Of Mahesh 23

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. చిరు మురుగదాస్ తో స్టాలిన్ మూవీ చేశారు.

అప్పుడే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అతను డైరక్ట్ చేసిన కత్తి సినిమాను ఖైదీ నంబర్ 150 గా రీమేక్ చేశారు. డైరక్టర్ పిలుపు మేరకు సెట్స్ కి వెళ్లిన చిరుకి మహేష్ బాబుతో పాటు యూనిట్ మొత్తం సాదరంగా స్వాగతం పలికింది. కాసేపు షూటింగ్ ని వీక్షించిన మెగాస్టార్ అనంతరం మురుగదాస్, మహేష్ తో కలిసి సినిమా గురించి చర్చించారు. ముగ్గురు సీరియస్ డిస్కషన్ లో ఉండగా ఆ సినిమా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఫోటో క్లిక్ మనిపించారు.  

చిరు రాక మాకెంతో సంతోషమంటూ కొన్ని క్షణాల క్రితం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని ఉగాది పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ జూన్ 23 న థియేటర్లోకి రానుంది.

{youtube}Ap7xdY35tP0{/youtube}

Related

  1. మహేష్, కొరటాల సినిమా టైటిల్ ఇదే!
  2. మహేష్ సినిమా పై రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
  3. మహేష్‌ యంగ్‌గా కనిపించడానికి అది చేయించుకున్నాడట!
  4. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -