Friday, May 24, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు ‘మహర్షి’ టీజర్ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్ర యూనిట్‌. ఈ రోజు మ‌హేశ్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫాన్స్‌కు ట్రీట్ ఇస్తామ‌ని చిత్ర యూనిట్ ముందుగానే ప్ర‌క‌టించింది.సినిమా టైటిల్‌తో పాటు,ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేశారు.కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న మహేష్‌.. అమ్మాయిలును త‌న కొంటే చూపుల‌తో చూస్తూ వెళ్తున్న టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది.అలా స్టైల్ గా నడుస్తూ ఒక చేత్తో హెయిర్ ని అలా దువ్వుకుంటూ మరో చేత్తో ల్యాప్ టాప్ పట్టుకుంటే ఎదురుగా వచ్చే అమ్మాయిలు ఏం కావాలి? ఓ అమ్మాయి అలా వెనక్కి తిరిగి చూస్తుంది మన మహేష్ కుడా వెనక్కి అలా తిరిగి చూస్తాడు.  పిక్చరైజేషన్లో వంశీ మ్యాజిక్.  టోటల్ గా ఆడియన్స్ క్లీన్ బౌల్డ్

దేవీ మార్క్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఇంప్రెసివ్‌గా ఉంది. మ‌హేశ్‌ను చూస్తుంటే ఇర‌వై సంవ‌త్స‌రాల‌లో కాలేజీకి వెళ్లే కుర్రాడిలా కనిపిస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం ఫుల్ ,గెడ్డం మీసంతో క‌నిపించ‌నున్నాడు.సినిమాను వ‌చ్చే ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -