Saturday, May 18, 2024
- Advertisement -

మహేశ్ -మురగదాస్ ల సినిమా బడ్జెట్ ఆ రేంజ్ లోనా!

- Advertisement -

ఒకవైపు బ్రహ్మోత్సవం సినిమా భారీ బడ్జెట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నంతలోనే.. మరోవైపు మహేశ్ తర్వాతి సినిమా విషయంలో కూడా బడ్జెట్ కహానీలు ఆసక్తికరంగా మారాయి. బ్రహ్మోత్సవం తర్వాత మహేశ్-మురగదాస్ ల కాంబినేషన్ లో ఒక సినిమా ప్రతిపాదన ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి రకరకాల కబుర్లు వినిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటేమిటంటే.. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించిన వార్త. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహేశ్ సినిమాకు 80 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ప్రతిపాదిస్తున్నాడట మురగదాస్. భారీ బడ్జెట్ పెడితేనే ఆ సినిమా బాగా వస్తుందని.. అందుకోసం ఆ సినిమాకు ఆ మాత్రం బడ్జెట్ అవసరం అని ఆయన చెబుతున్నాడట.

ఎంతకాదన్నా మురగదాస్ ఒక స్టార్ డైరెక్టర్ . బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలను డైరెక్ట్ చేసి హిట్ చేసిన చరిత్ర ఉన్నవాడు కాబట్టి ఇప్పుడు మహేశ్ కూడా మురగదాస్ సినిమా కోసం 80 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఓకే చెప్పే అవకాశాలున్నాయని అనుకోవాలి. అయితే… 

ఒక తెలుగు సినిమాకు ఎనభై కోట్ల బడ్జెట్ ఎంత వరకూ సేఫ్ అనేది గమనించుకోవాలి. బాహుబలి వంటి సినిమాప్రత్యేకం అని అనుకొంటే.. మిగతా సినిమాకు ఎనభై కోట్ల బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. అయితే బడ్జెట్్ విషయంలో కన్వీన్స్ చేసుకునే సామర్థ్యం మురగదాస్ కు ఉండవచ్చు. ఏదేమైనా అది భారీ బడ్జెట్టే.. ఇంకా పట్టాలెక్కకపోయినా.. ఆ సినిమా రేంజ్ చర్చనీయాంశం. ఒకవేళ ఈ ప్రతిపాదన పట్టాలెక్కితే.. మహేశ్- మురగదాస్ ల సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -