Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ విమానం చరణ్ పరువును తీస్తోంది..!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కేవలం సినిమాల్లోనే కాకుండా.. వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటాలని తపిస్తూ విమానయానరంగంలోకి దిగాడు.

అసలే నష్టాల్లో ఉన్న పరిశ్రమలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కొంతకాలం క్రితమే చరణ్ ఇమేజ్ తో, ఆయన వాటాతో ట్రూ జెట్ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అయితే…

తాజాగా ఆ సర్వీసుకు సంబంధించిన ఒక విమానం టేకాఫ్  విషయంలో మొరాయించడం చరణ్ పరువు తీస్తోంది. కేవలం టేకాఫ్ కావడంతో ప్రాబ్లమ్ అయితే ఒక లెక్క. అయితే చరణ్ విమాన సర్వీసు దారుణంగా ఫెయిలయ్యింది.

శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం కోసం ప్రయాణికులు అంతా వేచి ఉండగా.. ఆ విమానం టేకాఫ్ కాలేదు. అయితే.. కాసేపు వేచి ఉండమని ప్రయాణికులకు చెప్పారు. టికెట్ బుక్ చేసుకున్న వాళ్లంతా అలాగే కూర్చుండిపోయారు. అయితే.. సాయంత్రానికి కూడా విమానం బయల్దేరలేదు. అంతే కాదు.. సాయంత్రం వరకూ అందరినీ అలాగే కూర్చోబెట్టి.. చివరకు ఆ విమాన సర్వీసును ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి అర్జెంటుగా ప్రయాణం కోసం ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నవారికి తీవ్రమైన ఇబ్బంది కలిగినట్టే.దీంతో.. వాళ్లంతా చరణ్ విమానయాన సంస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రకమైన ఫెయిల్యూర్ ఆన్ లైన్ లోకూడా చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా చరణ్ పరువును తీస్తోంది ఈ వ్యవహారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -