Friday, May 17, 2024
- Advertisement -

సెంటిమెంట్ తో ముందుకు వెళ్లనున్న మహేష్-అనిల్

- Advertisement -

ప్రస్తుతం మహర్షి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం పైన కూడా ఫోకస్ పెట్టాడు. మహర్షి విజయం మహేష్ బాబు కెరీర్ లో అత్యంత కీలకమైనది. తన 25 వ చిత్రం విజయం అనుకున్న దానికి మించి ఉండటం తో మహేష్ ఆనందానికి అవధులు లేవు. ఇక కొద్దీ రోజుల్లో మహర్షి సంబరాల నుండి బయటకు వచ్చి మహేష్ అనిల్ తో సినిమా చేయనున్నాడు.

ఫిలిం నగర్ వర్గాల కథనాల ప్రకారం వచ్చే నెల ఈ సినిమా లాంచ్ జరిగి, ఆ పై నెల షూటింగ్ మొదలు కానుంది అంట. అయితే సాధారణం గా అనిల్ రావిపూడి టైటిల్స్ విషయం లో ఒక సెంటిమెంట్ అంటూ ఏది ఫాలో కాడు. కథ ని అనుసరిస్తూ ఏది సరిపోతుంది అనుకుంటే దాన్ని టైటిల్ లాగా పెడతాడు. కానీ ఇప్పుడు అనిల్ ముందు మహేష్ ఒక రిక్వెస్ట్ పెట్టాడు. తనకు మూడు అక్షరాలా టైటిల్ అచ్చి వచ్చిన నేపథ్యం లో ఈ సినిమా కి కూడా మూడు అక్షరాల టైటిల్ ని పెట్టాలని సూచించాడట. ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుంది అని మహేష్ మంచి ధీమా తో ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -