Thursday, May 2, 2024
- Advertisement -

మహేశ్ బాబును.. ఒక రేంజ్ లో వాడేసుకొంటున్నాడు!

- Advertisement -

తెలుగు సినిమాలో వారసులు అనే వాళ్లు తమ ఇంట్లోని పెద్దవాళ్లను వాడేసుకోవడం కొత్తేమీ కాదు. అప్పటికే ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న వాళ్లను అడ్డం పెట్టుకొని.. వాళ్ల పేర్లు చెప్పుకొనే ఎదిగే ప్రయత్నం చేసే వాళ్లు ఎంతోమంది ఉంటారు.

అసలు టాలీవుడ్ ఇలాంటి వారసులదే హవా. తాతల పేర్లు.. తండ్రుల పేర్లు చెప్పుకొని కాయలు అమ్ముకొనే వారే టాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ స్టార్లు. మరి ఇలా అందరూ చేస్తున్నారు.. తనెందుకు చేయకూడదంటూ.. లెక్కకు మించి ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్ బాబు.

మేనమామ కృష్ణా, బావ మహేశ్ బాబులను అడ్డం పెట్టుకొనే సినిమా స్టార్ గా వెలుగొందే ప్రయత్నాలు చేస్తున్నాడు సుధీర్. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశాడు. తాజాగా ఇతడు మహేవ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా తన తాజా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. భలే మంచి రోజు’ అనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆదివారం విడుదల చేశారు. ఇది మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా జరగడం విశేషం.

ఈ విధంగా ఫ్యాన్స్ తో కనెక్ట్ కావడానికి.. జనాల్లో తన సినిమాపై అటెన్షన్ ను తీసుకురావడానికి ప్రయత్నించాడు సుధీర్ బాబు. అయితే ఇలాంటి ప్రయత్నాలు కొత్తేమీ కాదు. ఇది వరకూ ఎన్నో జరిగాయి. ఇప్పుడు మళ్లీ జరుగుతున్నాయి. మరి ఈ సారి సుధీర్ కు ఎలాంటి అనుభవం మిగులుతుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -