Wednesday, May 15, 2024
- Advertisement -

లండన్‌ వీధుల్లో రకుల్ కా’రు’ జారి..ఏడ్చేసింది..!

- Advertisement -

టాలివుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాలభామ రకుల్‌ ప్రీత్‌ సింగ్ లండన్‌లో తప్పిపోయిందట. లండన్ వీధుల్లో దారి తప్పి ఎక్కడికి వెళ్ళానో తెలియక ఏడుస్తూ కూర్చుందట. తర్వాత ఒక లండన్ అబ్బాయి సహాయంతో మళ్ళీ తిరిగొచ్చింది. అసలు విషయం ఏంటంటే…

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌, రకుల్ ప్రీత్‌ సింగ్.. హీరో, హీరోయిన్లుగా నాన్నకి ప్రేమతో స్టార్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా లండన్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న నేపథ్యంలో రకుల్ మీద ఒక కారు సీన్ చిత్రీకరణ చేస్తున్నారట. ఈ అమ్మడుకి సీన్ అంతా చెప్పి, కొన్ని క్లోజ్‌అప్ షాట్స్ కోసం కెమెరాను కారుకే అమర్చి షూట్ స్టార్ట్‌ చేశారట. యాక్షన్ స్టార్ట్ అవ్వగానే రకుల్ కారు డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది.

కానీ డైరెక్టర్ చెప్పిన చోట యూ టర్న్ తీసుకోవడం మర్చిపోయింది. అలానే ముందుకు వెళ్తూ లండన్ వీధుల్లోకి వెళ్ళడంతో సినిమా యూనిట్ సభ్యులు ఉన్న అడ్రస్‌ మర్చిపోయింది. యూనిట్ సభ్యులకు ఫోన్‌ చేద్దామంటే అమ్మడు ఫోన్ తీసుకెళ్ళలేదు. ఎవరి నంబర్ గుర్తుకు లేదట. చేతిలో ఉన్న వాకీ, టాకీ కూడా పని చేయలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుందట.

అప్పుడు అక్కడ ఉన్న ఒక లండన్ అబ్బాయి ఏం జరిగింది అని అడిగితే.. మన హీరోయిన్ జరిగిన విషయం చెప్పటంతో, అతను మన హీరోయిన్‌కి ఒక దారి చెప్పాడు. అప్పుడు రకుల్ అతను చెప్పిన దారిని ఫాలో అవుతూ కొంచెం దూరం వచ్చిన తర్వాత వాకీ టాకీ పని చేసిందట. దీంతో సినిమా యూనిట్ సభ్యులు ఉన్న చోటికి చేరుకుంది. ఇది మన రకుల్ లండన్ వీధుల సంగతి..   

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -