Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ పై మహేశ్ బాబుది సంపూర్ణ ఆధిపత్యం అవుతుందా!

- Advertisement -

ఇప్పటికే బాహుబలి సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తుడిచేసింది. ఎక్కువగా మెగా ఫ్యామిలీ మీద లిఖించబడ్డ రికార్డులను ఆ సినిమా తుడిచేసింది. మగధీర, అత్తారింటికి దారేదీ..

వంటి సినిమాలను వెనక్కు నెట్టేసింది ఆ సినిమా. మరి అదే కాదు.. ఇప్పుడు మరో సినిమా కూడా మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేస్తోంది. కనీసం ద్వితీయ స్థానంలోని రికార్డులతో అయినా ఆనంద పడుతున్న మెగా ఫ్యామిలీని మరింత వెనక్కు నెట్టుతున్నాడు ‘శ్రీమంతుడు’

ఇప్పటికే తొలి రోజు వసూళ్ల విషయంలో ‘శ్రీమంతుడు’ అత్తారింటికి దారేదీ పై పై చేయిసాధించింది. అత్తారింటికి దారేదీ సినిమా తొలి రోజున పది కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేస్తే.. ‘శ్రీమంతుడు’ తొలి రోజు వసూళ్లు 14 కోట్ల రూపాయల స్థాయిలో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ విధంగా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో పవన్ సినిమా మీద మహేశ్ సినిమా సంపూర్ణ ఆధికత్యను ప్రదర్శించింది.

మరి ‘శ్రీమంతుడు’కి మంచి పాజిటివ్ టాక్ కూడా ఉంది. ఇదే తీరున ఇది కొనసాగితే.. ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తుడిచి పెట్టవచ్చు. బాహుబలి మీద కాకపోయినా.. పవన్ కల్యాణ్ సినిమా మీద అయినా.. పై చేయి సాధించడానికి అవకాశం ఇవ్వవచ్చు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -