Tuesday, May 14, 2024
- Advertisement -

‘స్పైడర్’ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు.. స్టార్ డైరెక్టర్ కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్పైడర్’ మూవీ దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ మూవీ సెన్సార్ ను కంప్లీట్ చేసుకొని.. U/A సర్టిఫికేట్ పొందినట్లు మూవీ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సాందు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

2 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న స్పైడర్‌ మూవీ మహేష్ కెరియర్‌లోను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారాయన. మురుగదాస్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ‘స్పైడర్’‌ను హాలీవుడ్‌ మూవీ రేంజ్‌లో తీర్చిదిద్దాడని సెన్సార్ సభ్యులు ఎక్కడా ఒక్క కట్ కూడా చెప్పకుండానే U/A సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. సినిమా మొత్తం ఎక్కడా బోరు అనేది లేకుండా రేసీ స్క్రీన్‌ప్లేతో మహేష్ చెప్పినట్టే ప్రేక్షకుడ్ని కుర్చీ అంచున కూర్చోబెడుతుందన్నారు.

ముఖ్యంగా ఈ మూవీ మహేష్ పెర్ఫామెన్స్ ఔట్‌స్టాండింగ్, టెర్రిఫిక్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సెన్సార్ సభ్యుడు ఉమైర్ సాందు. ఈ మూవీలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. హేరిస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో సందడి చేయనున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -