Friday, May 17, 2024
- Advertisement -

సినిమా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి గౌరవం!

- Advertisement -

బ్రహ్మోత్సవం సినిమాతో సూపర్ హిట్ కొడతారనుకుంటే మహేష్ కెరియర్లోనే డిజాస్టర్ సినిమాగా మిగిలేలా చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు. అన్నిచోట్ల ఆయనకు షాక్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీడియా అయితే ఇది కచ్చితంగా శ్రీకాంత్ అడ్డాల తప్పిదమే అంటూ చాటింపేస్తుంది. అయితే ఇలా కేవలం ఓ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం మొత్తం దర్శకుడే అవుతాడనడం కూడా కరెక్ట్ కాదు.

అదే విషయాన్ని మహేష్ కూడా సమర్ధించడం విశేషం.. తాను ట్రిప్ కు వెళ్లేందుకు ముందు మాట్లాడిన మీడియా వారితో మహేష్ శ్రీకాంత్ అడ్డాలను సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్టు సమాచారం. సినిమా మంచిగా రావడానికే అందరు కృషి చేస్తారు రిజల్ట్ అనేది మన చేతిలో లేదంటూ ప్రతిసారి చెప్పే మహేష్ ఈసారి కూడా అదే అంటున్నాడు. సినిమా ఫ్లాప్ అవ్వడం పట్ల కేవలం శ్రీకాంత్ అడ్డాలను మాత్రమే తప్పు పట్టడం కరెక్ట్ కాదని అంటున్నాడట.  

సో ఫ్లాప్ ఇచ్చినా దర్శకుడిగా మీద ఫైర్ అవ్వని మహేష్ గొప్ప తనం మెచ్చుకోక తప్పదు. అంతేకాదు ఆగడు ఫ్లాప్ అప్పుడు కూడా శ్రీనువైట్ల గురించి కూడా ఎటువంటి రాంగ్ వర్డ్ మాట్లాడలేదు మహేష్. ఇక బ్రహ్మోత్సవం విషయంలో కూడా అంతే. అంతేకాదు తన అభిమానులకు కూడా శ్రీకాంత్ అడ్డాల మీద  విరుచుకు పడొద్దని మెసేజ్ పంపిస్తున్నాడట. సినిమా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి గౌరవం ఇవ్వడంలో మహేష్ ఏమాత్రం తగ్గకుండా మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -