Saturday, May 11, 2024
- Advertisement -

మహేశ్26 కి ముహూర్తం కుదిరింది

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అప్డేట్స్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ రోజే అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా లో సినిమా కి సంబందించిన స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయి అనే విషయాన్ని చెప్పాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం పై చాలా మందికి చాలా అవగాహనలు ఉన్నాయి కానీ ఎవరూ అధికారికం గా ప్రకటించలేదు.

అయితే తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భం గా మే 31 న లాంచ్ అవ్వబోతుంది అనే విషయం తెలుస్తుంది. ఈ సినిమా ని దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తం గా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతాన్ని అందించనున్నాడు.

ఈ సినిమా లో విజయ శాంతి, రమ్యకృష్ణ ,రాహుల్ రవీంద్రన్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలు చేయనున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అవ్వనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -