Tuesday, May 14, 2024
- Advertisement -

చంద్ర‌బాబు సొంత జిల్లాలో బిగ్ షాక్‌….టీడీపీ నుంచి మొద‌టి వికెట్ డౌన్‌..

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో చ‌రిత్ర‌లో ఎప్పుడూలేన‌తంగా టీడీపీ తుడుచిపెట్టుకు పోయింది. వైసీపీ జోరుముందు బేజార‌య్యింది. జ‌గ‌న్ కొట్టిన సునామీ దెబ్బ‌కు పార్టీ న‌వ‌రంధ్రాలు మూసుకుపోయాయి. వైసీపీకి 151 సీట్లు వ‌స్తె టీడీపీకీ 23 సీట్లు వ‌చ్చాయి. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ క‌నీసం ఖాతానె తెర‌వ‌కుండా పోయింది. దీంతో ఆపార్టీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది. ఇక పార్టీ కోలుకోలేని ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో నేత‌లు పార్టీని వీడ‌టం మొద‌లు ఎట్టారు. తాజాగా టీడీపీనుంచి మొద‌టి వికెట్ డౌన్ అయ్యింది.

అదికూడా బాబు సొంత‌జిల్లానుంచి పార్టీని వీడ‌టం మొద‌లు పెట్టారు. తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత టీడీపీలోని ముఖ్య నాయకుల్లో ఫస్ట్ వికెట్ పడిపోయింది. గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి 2019ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనగంటి హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు.నియోజకవర్గంలో ఓటమితో జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత బండి ఆనందరెడ్డి వెల్లడించారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 59.67శాతం ఓట్ షేర్‌తో లక్షా 3వేల 38ఓట్లు సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కే.నారాయణ స్వామి టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనగంటి హరికృష్ణ పై 45వేల 594ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి 57వేల 444ఓట్లు వచ్చాయి. ప‌రిస్థితి ఇప్పుడే ఇలా వుంటె రాబోయె రోజుల్లో పార్టీ నుంచి ఎన్ని వికెట్లు డౌన్ అవుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -