Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ బాబు గుంటూరు కారం నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్

- Advertisement -

12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న గుంటూర్ కారం సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే షూటింగ్ వరుస వాయిదాల కారణంగా అభిమానుల్లో నిరాశ కలిగించింది. మొదట్లో స్క్రిప్ట్‌లో మార్పులు చేయడం తరువాత కొన్ని షూటింగ్ షెడ్యూల్‌లను కూడా రద్దు చేసింది. మరొక షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. ఎట్టకేలకు మహేష్ బాబు అభిమానులకు శుభవార్త న్యూస్ వచ్చేసింది.

చాలాసార్లు సినిమా షూటింగ్ వాయిదా పడుతు వస్సున్న ఈ సినిమా జూలై నుండి నాన్‌స్టాప్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. నిరంతర ఆలస్యం తర్వాత, చిత్ర బృందం జూలై నెల నుండి నాన్‌స్టాప్ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తోంది. చిత్ర బృందం ఎటువంటి విరామం లేకుండా షూట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇకపై ఆలస్యం జరగకుండా ఉండటానికి చిత్ర బృందం వారి ప్రణాళిక ప్రకారం అందరి కళాకారుల తేదీలను లాక్ చేస్తోంది.

ఎలాగైనా నవంబర్‌లోగా సినిమాను పూర్తి చేసి, ప్లాన్‌ ప్రకారం సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని గుంటూరు కారం టీం భావిస్తోంది. హైదరాబాద్‌లో ఓ భారీ హౌస్ సెట్‌ని వేసినట్లు, ఎక్కువ భాగం షూటింగ్ అక్కడే జరుపుకోనున్నట్లు సమాచారం. కనీసం ఇప్పటికైనా గుంటూరు కారం షూటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -