Monday, April 29, 2024
- Advertisement -

ప్రభాస్ సాలార్ టీజర్.. ఎప్పుడంటే..?

- Advertisement -

భారతీయ సినిమా అత్యంత ఎదురుచూస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా బిగ్ ఫిలిం సాలార్. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇది సీక్వెల్, KGF సిరీస్‌తో లింక్ ఉందంట్టు ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్లను పక్కన పెడితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో సాలార్ టీజర్ రిలీజ్ వార్త హల్ చల్ చేస్తోంది.

సాలార్ చిత్ర బృందం ఆదిపురుష్ విడుదల వరకు వేచి ఉంది, అందుకే వారు సినిమా టీజర్‌ను విడుదల చేయలేదు. ఈ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు మరియు భారతీయ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు టీజర్‌తో ప్రమోషన్స్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే 2 వారాల్లో సాలార్ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Also Read: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌ షూటింగ్‍కి బిగ్ బ్రేక్..

సాలార్ సెప్టెంబర్ 28, 2023న విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో, విడుదల తేదీని 2024 సంక్రాంతికి వాయిదా వేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ అధికారిక ధృవీకరించలేదు. KGF సిరీస్‌తో దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు ట్రేడ్‌ వర్గాలతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి టాక్‌ నడుస్తోంది. మరో వైపు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించాడో చూడాలని ఎదురుచూస్తున్నారు.

సాలార్‌లో ప్రభాస్ తో పాటు వర్ధరాజ మన్నార్ క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌, జగపతి బాబు మరియు శృతి హాసన్ ఇతర ప్రముఖ పాత్రల్లో నటింస్తున్నారు.

Also Read: రాజకీయాల్లోకి మరో తమిళ టాప్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -