Sunday, May 19, 2024
- Advertisement -

పాపం అనవసరం గా మహేష్ ని ఆడి పోసుకున్నారు

- Advertisement -

రాజమౌళి మాగ్నం ఓపస్ తరవాత గుణ శేకరుడి సేల్యూలయిడ్ సినిమా రుద్రమదేవి విడుదల కి సిద్దం అవుతోంది, ఈ సినిమా విడుదల రెండు రోజులే ఉండడం తో డైరెక్టర్ గుణ మంచి టెన్షన్ గా ఉన్నాడు.

రుద్రమదేవి పాత్ర కి ఎంత ప్రాధాన్యతని ఇచ్చాడో గోన గన్నారెడ్డి పాత్రకి కూడా అంతే ప్రచారాన్ని అందించాడు గుణ శేకర్ . ఈ పాత్ర కోసం మొదట్లో మహేష్ బాబు, ఎన్టీఆర్ , ప్రభాస్ లాంటి వాళ్ళని అడిగి చివరకి బన్నీ ని అడిగాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. గుణ శేకర్ కీ మహేష్ బాబు కీ మంచి రిలెషన్ ఉంది. ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన గుణ అంటే మహేష్ కి ఎప్పుడూ మక్కువే. తరవాత అర్జున్ లాంటి యావరేజ్ నీ సైనికుడు లాంటి డిసాస్టర్ నీ ఇచ్చినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. 

ఆ ఆలోచన తో మహేష్ కి గుణ గోన గన్నా రెడ్డి పాత్ర చెయ్యమని కోరాడు అని కానీ మహేష్ నో చెప్పేసాడు అని అప్పట్లో అంతా అన్నారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడం తో ఒక్కొక్కటిగా నిజాలు బయటకి వస్తున్నాయి. మహేష్ తో తనకి మంచి అనుబంధం ఉంది కానీ ఆ పాత్ర కోసం మహేష్ ని ఎప్రోచ్ కూడా కాలేదని చెప్పాడు గురుడు. ఈ పాత్ర తాను చేస్తానంటూ.. స్వచ్ఛందంగా అల్లు అర్జున్ ముందుకొచ్చాడని అందుకే బన్నీతోనే చేయించానని చెప్పాడు గుణ. ఈ డైరెక్టర్ ఇచ్చిన వివరణతో.. మహేష్ పై ఉన్న బ్లాక్ మార్క్ తొలగిపోయినట్లే ఇక.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -