Monday, May 20, 2024
- Advertisement -

అమరావతి శంకుస్థాపన విశేషాలు ఇవే :

- Advertisement -

ఈ నెల లో అమరావతి శంకుస్థాపన ఉండడం తో అందరి దృష్టీ ఇప్పటి నుంచే అక్కడ పడింది. శంకుస్థాపన సమయం దగ్గర పడే కొద్దీ ఆసక్తికర సమాచారం వెలుగు చూస్తోంది.

చంద్రబాబు నాయుడు గారు దీనిని ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనే విషయాలతో పటు ఎవరు ఎవరికీ ఆహ్వానాలు అందాయి లాంటి సమాచారం బయటకి వస్తోంది. ప్రధానమంత్రి నరెంద్రమోదీ లాంటి వారికి బాబు స్వయంగా కలిసి ఇచ్చిన విషయం తెలిసినిదే. 

ఈ విషయం లో రాజధాని శంకుస్థాపన ఏర్పాట్ల మీద మంత్రులు – సీఆర్డీఏ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి నారాయణ మీడియాకు ఆ వివరాలను తెలిపారు. అమరావతి విశిష్టత ని తెలుపుతూ 13 నుంచే 21 వరకూ జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చెయ్యబోతున్నారు. చరిత్రలో నిలిచిపోయే లాగా ఈ విశేషాలు జరుగుతాయి అంటున్నారు ఆయన. ముఖ్యమంత్రితో సమావేశంలో అమరావతి లోగో – శంఖుస్థాపన రోజున నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు – అమరావతి సంకల్ప జ్యోతి మన మట్టి-మన నీరు గురించి ప్రధానంగా చర్చించినట్లు వివరించారు. 

అక్టోబర్ 15 న 16 వేల గ్రామాల నుంచి కిలో మట్టి లీటర్ నీటిని కలాశాలలో నింపి అమరావతి కి తీసుకు వస్తారు అదంతా 18 నాటికి గుంటూరు చేరుకుంటుంది. ఇరవైన సంకల్ప జ్యోతి . శంఖుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజల వారసత్వానికి గౌరవానికి ప్రతీక అయినందున ప్రతి ఒక్కరూ ఇందులో తమ వంతు ప్రాత్ర పోషించాలని మంత్రి కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -