Wednesday, May 15, 2024
- Advertisement -

మళ్ళీ మహేష్- కొరటాల శివ కాంబినేషన్

- Advertisement -

మిర్చి సినిమా తో ఒక రైటర్ డైరెక్టర్ గా మారితే ఎలాంటి ఫలితం వస్తుందో నిరూపించిన కొరటాల శివ, శ్రీమంతుడు దెబ్బతో మహేష్ లాంటి టాప్ హీరోకి సరైన కథ పడితే ఏం సాధించగలం అనేది నిరూపించేసాడు. 

తన మొదటి సినిమాని మించిన హిట్ సాధించడం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న మహేష్ కి మెమరబుల్ సక్సెస్ ఇవ్వడం బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ఇప్పుడు కొరటాల మోస్డ్ డిమాండ్ ఉన్న డైరెక్టర్ అయిపోయాడు.  త్రివిక్రమ్ తరవాత మహేష్ కి బాగా దగ్గర అయిన డైరెక్టర్ కొరటాల శివ అనే చెప్పాలి అప్పట్లో దూకుడు తరవాత శ్రీను వైట్ల తో బాగా క్లోజ్ గా ఉన్న మహేష్ బాబు నెమ్మదిగా ఆగాడు దెబ్బతో అతన్ని దూరం పెట్టాడు. 

తాను ఎంత చెప్పినా సినిమా లో కోనా వెంకట్ ని పెట్టుకోలేదు అని అందువల్లనే ఆగాడు డిసాస్టర్ అయ్యింది అనే ఆలోచన లో బాబు అప్పట్లో ఉండడం తో ఇలా జరిగింది అంటారు. కొరటాలకు ఆడి కారుతో సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్.. తన మూవీస్ కి సంబంధించిన అంశాలపై డిస్కషన్ కూడా చేస్తున్నాడట. తను కూడా ఊహించని స్థాయిలో 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి.. తగిన విలువే ఇస్తున్నాడని టాలీవుడ్ లో అనుకుంటున్నారు. 

త్వరలో తప్పకుండా ఒక సినిమా చేద్దాం అని ఆయన ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసుకున్నాక ఇది చేద్దాం అని దానికోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని తనకి వినిపించాలి అని మహేష్ కోరాడట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -