Wednesday, May 15, 2024
- Advertisement -

హరీష్ శంకర్ మీద పిచ్చ కోపం తో ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్

- Advertisement -

తన సినిమా “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” ఆడియో కి మంచి స్పందన వచ్చి, సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండడం తో హరీష్ శంకర్ వరస పెట్టి ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్నాడు. 

ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటూ తన సినిమా ని ఎన్నడూ లేనంత రీతి లో ప్రచారం చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత కావడం తో క్రూ మొత్తాన్నీ ప్రమోషన్ విషయం లో ఎంతగా వాడుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందిలెండి. ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ అభిమాలు హరీష్ పై రుసరుసలాడుతున్నారు.  ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నా ప్రతీ సారీ గబ్బర్ సింగ్ గురించి మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ అని చెబుతూ మరొక పక్క రామయ్యా వస్తావయ్యా సినిమా విషయం ఎత్తగానే “ప్లాప్ ప్లాప్ ” అని పడే పడే చెబుతున్నాడట. 

ఓకే అది డిజాస్టర్ కరెక్టే. పశ్చాత్తాపంతో చెబుతున్నాడో హిట్ కొట్టలేకపోయాననే బాధతో చెబ్తున్నాడో కానీ.. రామయ్య ప్రస్తావన లేకుండా హరీష్ శంకర్ మాటలు కంప్లీట్ కావడం లేదు. ఇప్పుడు తాజాగా తీసిన సినిమా సంగతి మాట్లాడ్డం మానేసి అప్పుడెప్పుడో తీసిన ప్లాప్ గురించి ఎందుకయ్యా బాబూ అంటూ చిరాకు పడుతున్నారు ఎన్టీఆర్ ఫాన్స్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -