Tuesday, May 21, 2024
- Advertisement -

ఖరారు అయ్యింది: మహేశ్ పూరీల సినిమా పేరు అదే..!

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫ్యాన్స్ ను ఉద్వేగానికి గురి చేస్తోంది. విడుదలవ్వగానే చూసేయాలని ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు.

ఇదే సమయంలో మహేశ్ కు సంబంధించి రెండు సినిమాల వార్తలు కూడా అభిమానులను ఆకట్టుకొంటున్నాయి. అందులో ఒకటి ‘బ్రహ్మోత్సవం’ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే ఖరారు అయ్యింది.

దీనికి సంబంధించి లోగోను కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. మహేశ్ బాబు ఆ తర్వాత పూరీ  జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. పూరీ ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రతిపాదన  దశలో ఉండగా.. అలాంటి వాటిలో మహేశ్ తో ఒక సినిమా ఉంది. వరుణ్ తేజ్,  మెగాస్టార్ లతో సినిమాలు పూర్తి చేసిన తర్వాత పూరీ మహేశ్ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కూడా ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. మహేశ్ , పూరీల కాంబినేషన్ లో వస్తున్న సినిమా పేరు “టపోరీ” అని టాక్. ఇది వరకూ ఈ దర్శక, హీరోల కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు వచ్చాయి. అవి అభిమానులను అలరించాయి. ఇక డిఫరెంట్ టైటిల్స్ పెట్టడంలో పూరీకి తిరుగులేదు. అందులో భాగంగా ప్రిన్స్ తో సినిమాకు ‘టపోరీ’ అని టైటిల్ పెట్టాడట పూరీ. ప్రస్తుతానికి అయితే ఈ లీకును ఇచ్చారు. దీనికి వచ్చే రెస్పాన్స్ ను బట్టి టైటిల్ ను కన్ఫర్మ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -