Wednesday, May 22, 2024
- Advertisement -

నలుగురు ఆడవాళ్లు.. మోడీని మళ్లీ మొదటికి తెచ్చారు!

- Advertisement -

ఏడాది పాలన పూర్తి చేసుకొన్న విషయాన్ని చాలా గర్వంగా ప్రచారం చేసుకొన్నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భారీ మెజారిటీతో తిరుగులేని స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఏడాది సంబరాలు మొన్ననే ముగిశాయి.

మరి ఇదే సమయంలో నాలుగు కుంభకోణాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇవి మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. 

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఎలాంటి స్కాములు అయితే కాంగ్రెస్ పార్టీ పరువును తీశాయో.. కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాయో.. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి, జీరోని చేసి నిలబెట్టాయో.. మోడీ అండ్ కో వారి స్కామ్ లు కూడా అచ్చం అలానే ఉన్నాయి! ఈ స్కామ్ లో భాగస్వామ్యులు అయిన వారు మాత్రం ఆడవాళ్లే. వీళ్ల విషయంలో ఇప్పుడు బీజేపీ సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఎదురుదాడి చేయడానికి కూడా అవకాశం లేని రీతిలో ఆధారాలు దొరుకతున్నాయి. 

ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోడీకి సంబంధించిన వివాదంలో సుష్మాస్వరాజ్ , వసుంధర రాజేలు ఇరుక్కొన్నారు. వీరిలో వసుంధరకు తనయుడి కంపెనీలకు సంబంధించిన వివాదం కూడా తోడయ్యింది. ఇక స్మృతీ ఇరానీని ఏడాది నుంచినే విద్యార్హతలకు సంబంధించిన వివాదం వెంటాడుతూనే ఉంది. ఇక వీరికి తోడు పంకజ ముండే తోడయ్యారు. మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన పంకజ రెండు వందల కోట్ల కుంభకోణంలో భాగస్వామ్యులరాలైందనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి ఏడాది పాలనను పూర్తి చేసుకొన్న మోడీ సర్కారుపై ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలే వస్తున్నాయి. వీటి కంపును కమలం వారు ఎలా వదిలించుకొంటారో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -