Friday, May 10, 2024
- Advertisement -

మహేశ్ బాబు భయపడ్డాడు.. ఆ టైటిల్ కే ఫిక్సయ్యాడు..?!

- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా వస్తున్న సినిమాకు టైటిల్ దాదాపుగా ఫిక్సయినట్టే! ఇప్పటికే చాలా వరకూ షూటింగును పూర్తి చేసుకొన్న ఆ సినిమా టైటిల్ గురించి ఎడతెగకుండా జరుగుతున్న చర్చ ఒక కొలిక్కి వచ్చినట్టే..

తాజాగా ఆ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్ పెట్టిన ట్వీట్ ఈ అభిప్రాయాలను కలిగిస్తోంది. 

శ్రుతి తాజాగా ట్విటర్ లో ఒక ఫోటో ప్రచురిస్తూ.. ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ లో తీయించుకొన్న ఫోటో అంటూ.. ట్వీట్ చేసింది. మరి స్వయంగా ఆ సినిమాలో హీరోయిన్ తన ట్వీట్ లో సినిమాను ‘శ్రీమంతుడు’గా పేర్కొంది అంటే.. ఇక అదే టైటిట్ కన్ఫర్మ్ అయినట్టేనని అనుకోవాలి. మొదటగా ఈ సినిమాకు ‘మగాడు’ అనే టైటిల్ కూడా ప్రచారం లోకి వచ్చింది.

అయితే ‘మగాడు’ అనే టైటిల్ పై నెగిటవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆ పేరుతో ఇది వరకూ వచ్చిన సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో.. మహేశ్ కు ఆ టైటిల్ సెట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మహేశ్ కూడా ఆ భయాలను పరిగణనలోకి తీసుకొన్నట్టుగా సినీ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ఫిక్సయినట్టని తెలుస్తోంది. శ్రుతి ట్వీట్ తో ఈ  వాదనకు మరింత బలం చేకూరుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -