Monday, April 29, 2024
- Advertisement -

‘మజిలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్

- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా , సమంత హీరోయిన్ గా నటించిన సినిమా మజిలీ. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారమే విడుదల అయింది. సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పన్స్ వచ్చింది. సినిమా చూస్తున్నంత‌సేపు ఈ సీన్ నా జీవితంలో జ‌రిగింది క‌దా అనుకోవ‌డం వ‌ల్ల , సినిమా అంద‌రికి రీచ్ అవుతోంది.

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు త‌మ న‌ట‌న‌తో సినిమాకు ప్రాణం పోశారు. థియోట‌ర్ల‌లో పెద్ద‌గా సినిమాలు ఏమి లేక‌పోవ‌డం, వ‌రుస సెల‌వ‌లు కావ‌డం మ‌జిలీకి క‌లిసి వ‌చ్చే అంశం. దానికి తగినట్లుగానే సినిమా కలెక్షన్లు కూడా ఉన్నాయి. మొదటి రోజు ఈ సినిమా ఐదు కోట్లను రాబట్టింది.

ఏరియాల వారీగా కలెక్షన్లు..
నైజాం………….రూ. 1.85 కోట్లు
సీడెడ్……………రూ. 0.63 కోట్లు
వైజాగ్……………రూ. 0.76 కోట్లు
ఈస్ట్………………రూ. 0.27 కోట్లు
వెస్ట్……………….రూ. 0..25 కోట్లు
కృష్ణా…………….రూ. 0.37 కోట్లు
గుంటూరు…….రూ. 0.66 కోట్లు
నెల్లూరు……….రూ. 0.17 కోట్లు

మొత్తం ఐదు కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=OagcpQzyYSY

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -