Saturday, May 4, 2024
- Advertisement -

ఆర్సీబీలోకి రానున్న ఆసిస్ స్టార్ బౌలర్..

- Advertisement -

ఈఐపీఎల్ సీజన్లో ఆర్సీబీని దరిద్రం వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఘోరంగా పరాజయం చెందింది. స్టార్ బ్యాట్స్ మెన్లు ఉన్నా ఇప్పటి వరకు ఓక్క విజయాన్ని కూడూ నమోదు చేయలేదు. కోల్ తాతో జరిగిన మ్యాచ్ లో నైనా ఆర్సీబీ బోణీ కొడుతుందనుకుంటె ఘోరంగా విఫలం అయ్యింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్ కతా సునాయసంగా ఛేధించింది. ఆండ్రూ రస్సెల్ 13 బంతుల్లో 1 ఫోరు, 7 సిక్సర్ల సహాయంతో 48 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. బ్యాట్స్ మెన్లు దూకుడుగా ఆడుతున్నా ఫాస్ట్ బౌలర్లు తేలిపోతున్నారు. దీంతో ఆర్సీబీలోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు .

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చిన్నస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 205 పరుగులు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. స్పిన్నర్లు చాహల్, పవన్ నేగి ఫర్వాలేదనిపిస్తున్నా.. ఫాస్ట్ బౌలర్లు తేలిపోతున్నారు. మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, నవదీప్ షైనీ, మార్కస్ స్టాయినిస్ రూపంలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నా.. ఒక్కరు కూడా గెలిపించే ప్రదర్శన చేయలేకపోతున్నారు.

ఆస్ట్రేలియా పేసర్ నాథన్ కౌల్టర్ నైల్.. ఏప్రిల్ 13 నుంచి బెంగళూరు టీమ్‌లో ఆడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. అతను కేవలం రెండు వారాలు మాత్రమే ఆర్సీబీకి అందుబాటులో ఉండనున్నాడు. ఆతర్వాత వరల్డ్ కప్ నేపధ్యంలో స్వదేశానికి వెల్లనున్నాడు. నాథన్ కౌల్టర్ నైల్ రాకతోనైనా ఆర్సీబీ తల రాత మారుతుందా….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -