Thursday, May 2, 2024
- Advertisement -

పుకార్ల‌కు పెళ్లితో ఫుల్‌స్టాప్‌

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పుస సినిమాల‌తో అల‌రించిన మలయాళ నటి భావన పెళ్లి ఖాయ‌మైంది. డిసెంబ‌ర్ 22వ తేదీన పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఇటీవల ఆమె జీవితంపై ఎన్నో వివాదాలు, రూమ‌ర్లు త‌దిత‌ర వ‌చ్చాయి. నిశ్చితార్థం అయిన న‌వీన్‌తో తెగ‌తెంపుల‌య్యాయ‌ని, పెళ్లి కావ‌డం లేదని త‌దిత‌ర పుకార్లు వ‌చ్చాయి. వాట‌న‌న్నింటి కొట్టి పారేస్తూ ఈనెల‌లో త‌న ల‌వ‌ర్ న‌వీన్‌తో పెళ్లి చేసుకోనుంది. పెళ్లితో త‌నపై వ‌స్తున్న పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతోంది.

ఇటీవ‌ల స్టార్ హీరో దిలీప్ ఆమెను కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే భావన తను ప్రేమించిన నవీన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలో మార్చిలో వీరి నిశ్చితార్థం జ‌రిగింది. అయితే కిడ్నాప్ మూలంగా వీరి పెళ్లి జ‌ర‌గ‌డం లేద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అక్టోబర్‌లో పెళ్లి అనుకోగా కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ విధంగా పుకార్లు వ‌చ్చాయి.

అయితే అవన్నీ వట్టి పుకార్లుగా తేల్చేస్తూ పెళ్లిపీటలు ఎక్కేందుకు భావ‌న సిద్ధ‌మైంది. డిసంబర్ 22వ తేదీ శుభ ముహూర్తానికి న‌వీన్‌తో ఏకం కానుంది. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల మధ్యన త్రిస్సూర్‌లో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -