రేష్మ.. ఒకప్పుడు మళయాల సీని పరిశ్రమను ఊపేసిన తార. షకీలాతో సమానంగా మళయాల సీని పరిశ్రమను ఏలిన స్టార్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆమె కనిపించడం లేదు. విదేశాలకు మకాం మార్చిందని కొందరు.. లేదు లేదు పెళ్లి చేసుకుందని మరికొందరు.. ఇలా రకరకాల వాదనలు వినిపించాయి.. వినిపిస్తూనే ఉన్నాయి. మరికొందరైతే ఆమె మరణించిందని వాదించారు. అదృష్టవశాత్తు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ పుకార్లకు తెరపడింది. ఏదేమైనా రేష్మా తెరమరుగై 12 ఏళ్లైనా.. ఆ మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు.
ఇండస్ట్రీకి హిరోయిన్ అవుదామని వచ్చింది రేష్మా. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాలనుకుంది. కానీ అది వేరే విధంగా జరిగింది. మెయిన్‌స్ట్రీమ్ సినిమాలు చేద్దామని వచ్చిన ఆమె.. కొన్ని పరిస్థితులు సెమీ పోర్న్ మూవీస్‌లో నటించేలా చేశాయి. రేష్మా ఆ కాలంలోనే మాలీవుడ్‌లో 5 లక్షల పారితోషకం అందుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. కానీ అతి కొద్ది కాలంలోనే పరిస్థితులు మారిపోయాయి. తన సహానటులైన షకీలా, సిల్క్‌స్మిత తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. కానీ రెష్మాకు అది చేత కాలేదు. తనో సెక్స్ వర్కర్‌గా మారింది.
2007లో ఓ సెక్స్ రాకెట్ కేసులో చిక్కుకొని బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత రేష్మా మళ్లీ కనిపించలేదు. మిస్టరీగా మారిన ఈ అంశంపై లెటేస్ట్‌గా ఆమె సహనటి షకీలా స్పందించింది. రేష్మ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందని, మైసూరులో స్థిరపడిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. గతంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోయేందుకు రేష్మా ట్రై చేస్తుందని వివరణ ఇచ్చింది.
