Tuesday, May 21, 2024
- Advertisement -

వైఎస్ పాత్ర‌లో తండ్రి… జ‌గ‌న్ పాత్ర‌లో కొడుకు

- Advertisement -

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌పుకోంటోంది. ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీన ‘యాత్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే జ‌గ‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది. జ‌గ‌న్ పాత్ర‌కోసం న‌టుడి ఎంపిక వ్య‌వ‌హారం ఇంకా కొన‌సాగుతోంది.

గ‌తంలో త‌మిళ‌న‌టుడు సూర్య న‌టిస్తున్నార‌నే వార్త‌లు మొద‌ట వినిపించినా త‌ర్వాత త‌మ్ముడు కార్తి ఆపాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెల‌సిందే. ఈ మ‌ధ్య‌నే విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. జగన్ పాత్రను విజయ్ చేస్తాడని వెబ్ మీడియాలో గట్టిగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. చిత్ర యూనిట్‌కూడా ఎక్క‌డా జ‌గ‌న్ పాత్ర‌లో ప‌లానా వ్య‌క్తి న‌టిస్తున్నార‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇప్పుడు తాజాగా మ‌రో హీరోపేరు కూడా వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్‌ను జగన్‌గా చూపించాలని ‘యాత్ర’ రూపకర్తలు భావిస్తున్నారట. తండ్రి పాత్రలో మమ్ముట్టీ, తనయుడి పాత్రలో దుల్కర్‌లో నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే దీనికి మమ్ముట్టీ ఆమోదం తెలపలేదని సమాచారం. జ‌గ‌న్ పాత్ర‌కోసం ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -